Thursday, April 7, 2011

నవ్వొస్తోంది...



స్వేచ్చగా వీచే
గాలిని పిడికిట పట్టే
నీ మూర్ఖత్వం చూస్తే
నవ్వు వస్తోంది...

వెన్నెల చల్లదనాన్ని
గదిలో బంధించ జూచే
నీ అహంకారాన్ని చూస్తే
నవ్వు వస్తోంది...

ఉదయించే సూర్యున్ని
అడ్డంగా నిలబడి
ఆపేద్దామన్న
నీ ఆరాటం చూస్తే
నవ్వు వస్తోంది...

గల గల పారే సెలయేళ్ళను
సీసాలో పట్టేస్తానన్న
నీ ప్రయాస చూస్తే
నవ్వు వస్తోంది...

6 comments:

  1. చాలా బాగా రాసారు!...
    సహజత్వం లో వుండే పరిమళాన్ని ఆఘ్రాణించినట్టున్నారు! అభినందనలు!!

    ("కోటలో రాణి కొండవీటి రాజా " ప్రోగ్రాం వాళ్ళాకి పంపండి బుధ్ధొస్తుంది.)

    ReplyDelete
  2. @సత్యః సార్ మీ అభినందనలకు ధన్యవాదాలు.. కొండవీటి రాజా కోటలో రాణి ప్రోగ్రాంను నిషేధించమని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.. కానీ వారి గొంతుకు తోడయ్యేవారు కరువయ్యారు...

    ReplyDelete
  3. పోయెం చాలా బావుంది.
    ఈ కోటాలో రాణీ ప్రోగ్రాం ఏమిటి? టీవీ పోటీ కార్యక్రమమా??

    ReplyDelete
  4. నాలుగ్గోడల నడుమ నీలుగుతున్న నవ నాగరికుని జీవితాన్ని బాగా ఎత్తిపొడిచారు. ప్రకృతిని గోడ మీద పెయింటింగ్స్ లో ఆరాధించేవారు నవ్వటమూ మరిచే ఉంటారు. మీరు పెట్టిన బొమ్మలో నవ్వులు గాలికి ఊగే బంతిపూల రెక్కలనీ, ఆకుల మీద గెంతే సీతాకోకచిలుక రంగులనీ జ్ఞాపకానికి తెస్తున్నాయి.

    ReplyDelete
  5. @కొత్తపాళీః సార్ అది జీతెలుగులో వస్తున్న టీవీ ప్రోగ్రాం సార్.. కవిత నచ్చినచ్చి కామెంటుంచినందుకు ధన్యవాదాలు సార్..

    ReplyDelete
  6. @ఉషగారూ చాన్నాళ్ళ తరువాత మీ వ్యాఖ్య పొందడం ఆనందంగా వుంది.. ధన్యవాదాలు...

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...