Sunday, March 7, 2010

కొంగూ నడుముకు చుట్టవే చెల్లెమ్మా



కొంగూ నడుముకు చుట్టవే చెల్లెమ్మా
కొడవళ్ళు చేపట్టవే చెల్లెమ్మా
ఈ పాట యిప్పటికీ నిజాయితీగా మారుమోగుతోంది

ఈ లిప్ స్టిక్ భామల, ఎత్తుమడమల
హైటెక్కు నిక్కులకు మోసపోవద్దు

ఆకాశంలో సగంను అడ్డంగా కత్తిరించి
ఓట్ల డబ్బాలో వేయజూసే వీరి మోసాలను
ఎండగట్ట గంగ దాటిరావాలని పిలుపునిస్తున్నా

నేతిబీరకాయ ప్రజాస్వామ్యంలో
ఎన్నటికీ రాని వాటా కోసం
పోరాటమొక్కటే అమరులకిచ్చే నివాళి

అర్థరాత్రి నడిచే స్వాతంత్ర్యం పబ్ లనుంచి
కాదు
పగలయినా పగలబడినవ్వే
స్వేచ్చ కోసం..

7 comments:

  1. ముగి౦పు అధ్బుత౦గా బాగు౦ది.....చాలా సార్లు చదివాను..ప్రతిసారి కొత్తగా అనిపి౦చి౦ది.మాములు పదాలతో ,సున్నితమైన బావాలు పదునుగా రాశారు ...

    ReplyDelete
  2. సుభద్ర గారు మీ ఆత్మీయ వ్యాఖ్యకు ధన్యవాదాలు..

    ReplyDelete
  3. చాలాబాగుందండీ ....నేతిబీరకాయ ప్రజాస్వామ్యం ....నిజమైన ప్రజాస్వామ్యం తీసుకురావాలని ఎవరైనా ముందు అడుగు వేస్తే ప్రజలు ఎందుకు వారికీ సహకరించరు?

    ReplyDelete
  4. anagha గారూ ధన్యవాదాలు. ప్రజలు నిజం గ్రహించిన నాడు తప్పక సహకరిస్తారు.

    ReplyDelete
  5. "అర్థరాత్రి నడిచే స్వాతంత్ర్యం పబ్ లనుంచి
    కాదు
    పగలయినా పగలబడినవ్వే
    స్వేచ్చ కోసం.."

    ముగింపు చాలా బాగుందండీ. దీని మీదనే నేనొక పోస్ట్ రాసాను. వీలుంటే చూడండి.

    http://vivaha-bhojanambu.blogspot.com/2010/03/blog-post.html

    ReplyDelete
  6. sowmya cheppinde nenu kuda cheppali

    _prakash chowdary

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...