Saturday, January 16, 2010

కాళ్ళ కింద భూమే మింగేస్తే..


అంతవరకు తనను ఒడిలో లాలించిన
తల్లి ఒక్కసారిగా విదిలించి మోదినట్లు
నేలతల్లి నిట్ట నిలువుగా చీలిపోయి
పాము తన పిల్లలను తానే
మింగినట్లు తమనంతా
తన కడుపు చీల్చి
పాతిపెట్టితే

కప్పై తమను కాపాడుతుందనుకున్న
ఇల్లే తమకు సమాధి అవుతుందని
కలలో కూడా వూహించక గుండె మీద
చేయేసుకు నిదురపోతున్న హైతీ

నేడు నిస్సహాయంగా దీనంగా
అనాథ అయినది

3 comments:

  1. రెండు పార్శ్వాలు - ప్రకృతి ని నిందిస్తున్నట్లు, రెండవది బాధితుల పట్ల సానుభూతి కనపర్స్తున్నట్లు.

    ప్రకృతి వైపరీత్యాలకి కారణాలని అదుపు చేయవచ్చు. వాతావరణ కాలుష్యాలని అరికట్టవచ్చు. భూమిని నిలువునా తవ్వి పారేయటం నివారించవచ్చు.ఇంకెన్నో. మానవ శక్తిని మించిన వాటికి మనవద్ద ఆయుధం లేదు.

    బాధితులకి కావాల్సింది సహాయం. చెల్లాచెదురైన జీవితాల్లో కాస్త ఉపశమనం. మనకి వీలైనంత అవి ఇద్దాం.
    లెక్క తప్పిన అనులోమ విలోమ నిష్పత్తి! http://maruvam.blogspot.com/2009/05/blog-post.html లో నేను ప్రస్తావన తెచ్చాను మరొక కోణంలో...

    ReplyDelete
  2. అప్పారావు శాస్త్రి గురించి వాది నీచపు బ్రథుకు గురించి ఇక్కద చుదందీ

    http://telugusimha.blogspot.com/

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...