Tuesday, March 28, 2017

ఎలా దగ్ధం చేసుకోను?

ఈ పిడికెడు గుండెను
ఎలా దగ్ధం చేసుకోను?

కొన్ని సమూహాల సామూహిక
దహనకాండ మధ్య

కొన్ని ఆకులు రాల్చిన అరణ్యాల
మంటల చివుళ్ళ మధ్య

పాయలుగా చీలి ఇగిరిపోతున్న
నదీ ప్రవాహాల నడుమ

ఈ కన్నులు రాల్చిన నెత్తరంటిన
పిడికెడు గుండెను
ఎలా దగ్ధం చేసుకోను?

తెగిపడిన తల నవ్వుతూ
రేపటిని కలగా
వాగ్దానమిస్తూన్న వేళ

అరచేతుల మధ్య
ఈ పిడికెడు గుండెను
ఎలా దగ్ధం చేసుకోను??

1 comment:

 1. అనుక్షణం పరితపించే మనసుకు మాటతోనే సాంత్వన
  అనునిత్యం కలవరించే తలపులకు మౌనంతోనే పొంతన
  గాయమైన మనసుకు ఊరటనిచ్చే మాటలు
  ఎదురు చూసే కన్నులకు కన్నీరు కాకూడదు అలంకారాలు

  కనుక..

  ఆశ అడియాశల పోరులో అడియాశనే నెగ్గని
  నిట్టూర్పు సెగలే భగ్గున మండి చల్లారి పోని
  వేకువే కానరాక చుట్టు చీకటే అలుముకోని
  ఐనా కాని..
  అతలాకుతలమైన సంద్రంలో మాత్రమే నావ పయనించగలదు
  రాగద్వేషాలతో మమేకమైన మనసు మాత్రమే సంతోషాన్ని వెలికితీయగలదు.

  ~శ్రీ~

  ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...