Saturday, December 24, 2016

కొన్ని దృశ్యాలు!!

కొన్ని పేజీలను
నీకంటూ రాసుకుంటావ్!

కానీ
ఆఖరు పేజీ చిరిగి
నువ్వంటూ
కనబడవేం?

వద్దింక
సరిహద్దులు
చెరిపేయి!

ఖాళీ
నల్లరంగు సిరాబుడ్డీ
వెక్కిరిస్తూ!

చినిగిన కాగితప్పడవ
మునకలో
కొన్ని నీటి బిందువులు!

ఆ వీధి మలుపులో
ముసలి అవ్వ
చేతులు ఖాళీగా!

చలినెగడు చుట్టూ
పరచుకున్న రగ్గులు
ముడుచుకుంటూ!!

(Dec.22.2016)

10 comments:

  1. వర్మ గారు..!
    మీ కవితలో చిరిగిన కాయితం ముక్క..సిరా బుడ్డి.. జీవితపు ఔనత్యాన్ని తెలిపితే ముసలి అవ్వ..రగ్గు.. చలి కుంపటి మాత్రం.. జీవితం ఏదో ఒక రోజునా ముగుస్తుందని.. అహంకారం వద్దని.. బ్రతికున్ననాళ్ళు మానవత్వపు సత్ప్రవర్తనను అలవర్చుకోవాలని సూచించాయి సర్..అదే నా వ్యాఖ్యా


    ఏదో నాలుగు ముక్కలు జీవితం గురించి వ్రాయాలని తపన..
    చిన్నప్పుడు.. వ్రాతలు రాకా.. మాటలన్ని లోలోపలే దాగి అమ్మ వొడిలో సేదతీరి ఆ వ్రాయటాన్ని బాల్యానికీ అందుకోమని చెప్పా..

    అప్పుడప్పుడే పసితనపు ఛాయలను వీడి బాల్యపు దశలో తొలి అడుగులు.. మాటలు వ్రాతలు ఒక్కొక్కటిగా నేర్చుకుంటున్నావు.. ఇప్పుడే జీవితం గూర్చి ఏమి తెలుసుకోగలవంటే.. యవ్వనానికీ అందించి బాల్యాన్ని ఆస్వాదించాను..

    యవ్వనం రానే వచ్చింది.. పూలతోటలో వికసించే విరుల పరిమళభరితంగా.. (ఇప్పుడు నాది ఈ దశ)
    వ్రాయాలని ఉన్నా.. ఇప్పుడిప్పుడే ఘడియలని నెమురు వేసుకుంటున్నా.. ఇవన్ని జ్ఞాపికలుగా తీర్చిదిద్ది ఒక్కోక్కటిగా తరువాత వ్రాద్దామని పనిలో నిమగ్నమై ఆ ఆలోచనని పక్కన పెట్టాను..

    జీవితాన్ని మించిన మహాకావ్యం మరొకటిలేదని అగుపించి.. జ్ఞాపకాలన్ని జ్ఞాపికలుగా మరేలోగా మరో ముప్పై-నలభై ఏళ్ళ పైచిలుకు వృద్ధాప్యం వచ్చేస్తుందని.. అటువంటప్పుడు వ్రాసే బదులు వాటన్నిటిని నలుగురితో పంచుకుని.. కాటిలో కట్టేలా కాలే కనుమరుగవక మునుపే ఏ నలుగురి మదిలోనైనా చిరకాలం కాకున్న చిరుకాలమైనా ఓ తీపి జ్ఞాపకమై మిగిలుండాలని ఆశ!

    ~శ్రీధర్ భూక్య

    ReplyDelete
    Replies
    1. మీ విశ్లేషణాత్మక ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు భూక్యాజీ. మీరన్నట్టు జీవితమే మహాకావ్యం, దానిని అధ్యయనం చేయడం సాగర మధనమే.

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
  2. మీరు ఎప్పుడూ అధ్భుతంగా వ్రాస్తారు.

    ReplyDelete
    Replies
    1. మీ మాటెప్పుడూ స్ఫూర్తిదాయకం తెలుగమ్మాయి గారు.

      Delete
  3. మీ దృశ్యకావ్యాక్షరాలు కడురమ్యం.

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయతకు ధన్యవాదాలు పద్మాజీ..

      Delete
  4. మీ కవితల్లో మంచి ఉద్వేగం పస ఉంది.

    ReplyDelete
  5. భవ్యం
    మీ
    అక్షరాలు

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...