వెళ్ళిన వాళ్లు తిరిగి వస్తారని ఆ ఇంటి
గుమ్మం ఎదురు చూస్తోంది
వాళ్ళేదో కోట్లకొద్దీ రూపాయి మూటలు
మోసుకొస్తారని కాదు
వాళ్ళేదో బంగారపు గనులు
తవ్వుకొస్తారని కాదు
వాళ్ళేదో తాను పడుతున్న ఈతిబాధలన్నీ
తీరుస్తారనీ కాదు
వాళ్ళేదో మేడ మీద మేడలు
కడతారనీ కాదు
వాళ్ళేదో సిరిమంతులయి ఊరిని
దత్తత తీసుకొంటారని కాదు
కానీ వాళ్ళింక రారని సిమెంటు కాంక్రీటు
కింద మాంసపు ముద్దలయ్యారని తెలవక
ఆ ఇంటి గుమ్మం రెండు కళ్ళు తెరచుకొని
ముంగాళ్ళ మధ్యలో తల పెట్టుకొని ఎదురు చూస్తోంది!!
(నానక్ రాంగూడలో కూలిన ఉత్తరాంధ్ర వలస బతుకులకు కన్నీటితో)
No comments:
Post a Comment
నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..