Sunday, June 5, 2016

యశోధరను..

ఈ తెలవారని రేయినిలా
నివురులా ఓ కఫన్ కప్పుకొని

నువ్వలా నిశ్శబ్దంగా నడుచుకుంటూ
పోతూ చివరిగా తాకిన నీ వేలి చివరి
తడి ఇంకా ఆరనే లేదు

మరో వైశాఖి నన్ను వెక్కిరిస్తూ
అలల కల్లోలంలో మిణుగురులా దోబూచులాడుతూ

నేనిలా
ఓ తెగిపడిన రావి ఆకులా

రహదారి దుమ్ములో
విరిగిన భిక్షా పాత్రలా

చెదరిన కలలో నీ రాకకై
ఈ ఎండమావి తీరాన
ఇసుక సంద్రంలో ఓ రేణువుగా చెరిగిపోతూ!

నీ
యశోధరను..

1 comment:

  1. రావి చెట్టు పవిత్రమైనది.. తెగి పడిన రావి ఆకు..
    మామిడి చెట్టు పవిత్రమైనది.. తోరణమై మామిడాకు..

    మీ కవితలో ప్రకృతి తో పాటుగా వస్తువులను ఉపయోగించటం చాలా బాగుంది సర్.. ఇంతక్రితం మీ రచనలొ విరిగిన కూజ చూశాను..

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...