కదలిక లేనితనం ఒకటి వెంబడిస్తూ
నీలోని చర్యా ప్రతి చర్యలను నియంత్రిస్తుంది
అటూ ఇటూ ఒక కనబడని ఇనుపతెర
పరచుకొని ఒరుస్తూ గాయపరుస్తుంది
గడ్డకట్టిన హృదయం వెచ్చని అశృవుగా
బొట్లు బొట్లుగా రాలుతుంది
నువ్వంటావు ఈ మాయ తెర
చినుగుతుందా అని
విత్తిన ఆ గింజ పగిలి ఎర్ర చిగురు
తొడగక మానదు కదా?
కాసేపిలా ఒత్తిగిలి ఈ మట్టివాసన
గుండెల్నిండా తీసుకోనీ!!
clean and green
ReplyDeleteFor, Until there is power in the sea, the tides touch the shore and revert back.
ReplyDeleteFor, Until there is life in the nature, the old tree shall start to grow a shoot of life.
For Until, the last breath, one must never forget those who were in the life and made it meaningful with their presence.
Awesome Poetry Kumar Verma Sir..
చెట్టు మోడుబారినా చివురించును కదా నవపల్లవులతో
విత్తిన ఆ గింజ పగిలి ఎర్ర చిగురు
ReplyDeleteతొడగక మానదు కదా?Positive thought sir.