Sunday, February 28, 2016

ఊరుకో...

అలా ఒక్కసారిగా ఎగసిపాడుతున్న

దు:ఖపు అలను ఒడిసిపట్టి
కాసేపు నిదానించు

గుండెకు దగ్గరగా హత్తుకున్న నీ మోకాళ్ళు
కాస్తా ఊరటనిస్తాయి

ఈ అలికిన మట్టి గోడనానుకొని కాసింత
దమ్ము తీర్చుకో

గాయమైన చోట ఒకసారి నీ వేలితో
నిమురుకో

యుద్ధానికి యుద్దానికి నడుమ
కాసింత ఊపిరి తీసుకొ

ఆ పచ్చని నేల నిన్నలా ఆదరంగా
అక్కున చేర్చుకుని లేపనమవుతుంది

కాసేపు

రు
కో
గాయం సహజమే కదా
మనిషిగా నిలబడాలనుకుంటే...

1 comment:

  1. నాది కాని నన్ను నన్నుగా పరిచయం చేశావు
    పరిచయాల మలుపులో ముళ్ళన్ని పువ్వులుగా మలిచావు
    ఒక్కో ముల్లు నీ చేతికి గుచ్చుకుంటే తల్లడిల్లిపోయాను
    నా పట్ల నీకున్న ఇష్టానికి చలించి దాసోహమన్నాను

    కెరటం లా ఉవ్వెత్తున ఎగిసే కాలమది
    ప్రశ్నకై సమాధానం అందించే నిధి అది

    కన్నీటి అలను ఆపగా చేతులు చాచనా
    నిన్ను మరల అక్కున చేర్చుకుని లాలించనా

    లేకా

    నీ ఒడిలో పసిబాలకుడినై సేదతీరనా
    ఎన్ని జన్మలైనా నీతోనే నేనై ఉండనా

    ~శ్రీ~

    కే క్యూబ్ కుమార్ వర్మ గారు మీ ఈ కవిత కు నా ప్రతికవిత వ్యాఖ్యగా..

    భావాలను తట్టి లేపుతోంది.. 03:37 24.03.2016

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...