కాలమిక్కడ స్నేహంగానే గుండెల్లో మంచు కత్తిని
దించుతూ
పొగరుగా నవ్వతూ ఉంటే
చీకటి చొక్కాలో దాగిన ఆత్మ ఒక్కసారిగా
జారిపోతూ
వెన్నుపోటు పొడుస్తూ ఉంటే
నీ కాళ్ళు నీ గమ్యానికి దూరంగా
జరుగుతూ
ఒంటరిగా విడిచి పోతూ ఉంటే
కాలుతూ రాలిపడ్డ ఉల్క ఏదో
మెరుస్తూ
నేల మాళిగలోకి చేరిపోతూ ఉంటే
ఏం
రా
య
ను
కొన్ని దేహాలకు ఆత్మలు లేవనా?
నువ్ నువ్వు కాదనా?
దేహం ఆత్మ స్నేహితులు
ReplyDeleteజీవాత్మ పరమాత్మ సన్నిహితులు
ఆకాశం భూమి ఆజన్మ స్నేహితులు