Wednesday, December 2, 2015

Last Line!


ఇప్పుడో కత్తి సర్రున
నీ మెడపై దూసుకు వస్తూ చిన్నగా దూదిలా
తాకీ తాకనట్లు కోస్తూ పోతూ వున్నప్పుడు


అధాటున నువ్వలా జారి నేలమీదకు
ఒరిగి కాసేపు చిమ్మిన నెత్తురునలా 
ఒడిసిపట్టిన వేళ


ఆ ఆకు చివర కరుగుతున్న మంచు బిందువొకటి
చివరిగా నీ కనురెప్పలపై జారి


ఐమూలగా దాగిన కల నీలోకి ఇగిరిపోయి
ఆఖరుగా ఓ మాట మౌనంగా శబ్దాన్ని
ఛేదిస్తూ...

2 comments:

  1. ఆకు చివర కరుగుతున్న మంచు బిందువొకటి
    చివరిగా నీ కనురెప్పలపై జారి...చాలా నచ్చింది

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...