Thursday, December 17, 2015

అస్పష్టంగా..


ఏదో వెనకటి కాలమేదో చొక్కా కాలర్
పట్టుకుని గుంజినట్టు
ఒక్కసారిగా నిన్ను నువ్ కాచుకోలేక
ఒరిగిపోతావ్

నీ చుట్టూ ఏవో నీవి కానివేవో కుప్పగా
పేరుకుపోయి ఊపిరిసలపక 
గిలగిలా కొట్టుకొని కనుల ముందో
అస్పష్టపు చిరిగిన తెర

వెన్నులో ఒక్కసారిగా ఏదో కస్సున దిగినట్లు
బాధగా గొంతులో ఓ మూలుగు
నువ్ అలా విరిగిపోయిన చెట్టు కొమ్మలా
నిశ్చేష్టుడవై రెక్కలు వెనక్కి విరిచి

కాలమలా అంగలు వేసుకుంటూ 
నిన్ను దాటుకుంటూ పోతూ
విసిరేసిన
ఓ సగం కాలిన
కల 
నీతో
సంభాషిస్తూ!!?

4 comments:

  1. చివరి నాలుగు మాటలు టచింగ్...మీరు ఇలా రాయడంలో సిధ్ధహస్తులు

    ReplyDelete

  2. వెన్నులో ఒక్కసారిగా ఏదో కస్సున దిగినట్లు
    బాధగా గొంతులో ఓ మూలుగు..భావ వ్యక్తీకరణ బాగుంది.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...