Saturday, January 16, 2016

చింత పువ్వు...


నేనలా ఆ కొవ్వొత్తి ఓరగా 
పొక్కులు పొక్కులుగా జారుతు
ఘనీభవిస్తున్న మైనంలా

ను
వ్వ
లా
నిశ్చలంగా ఉలి శ్రమిస్తున్న 
రాయిలా

ఈ హిమమై వణుకుతున్న
రేయి
అరచేతులు చల్లబడుతు

ఆకులేవో మౌనంగా
రాలిపోతూ
తొడిమ చివర
జారుతున్న నీటిబొట్టులా

వెన్నెల క్రీనీడలో
చింత పువ్వులా మెరుస్తూ
ఒక మిణుగురు

కొన్ని క్షణాల ఒడంబడికలా
దేహమంతా ఒకపరి
జలదరిస్తూ

ఆ అలికిన గోడపై ఓ 
నీడ కదలాడి చేయంచున
తాకుతూ

నే
ని
లా
గాలికి ఎగురుతున్న ఓ
పేజీలా అటూ ఇటూ
ఠప్ మని
నిశ్శబ్దాన్ని చెరుపుతూ...!

2 comments:

 1. ఆకులేవో మౌనంగా
  రాలిపోతూ
  తొడిమ చివర
  జారుతున్న నీటిబొట్టులా..అధ్భుత

  ReplyDelete

 2. నేనలా ఆ కొవ్వొత్తి ఓరగా
  పొక్కులు పొక్కులుగా జారుతు
  ఘనీభవిస్తున్న మైనంలా

  ను
  వ్వ
  లా
  నిశ్చలంగా ఉలి శ్రమిస్తున్న
  రాయిలా....నిజమా లేక కవితా :-)

  ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...