నది చుట్టూ కొన్ని పద్యాలు
అల్లుకునే వుంటాయి
నదిని ఒరుసుకుంటూ నిలిచిన రాతి
బొమ్మలేవో తెగిన రాగాన్ని ఆలపిస్తూ ఉంటాయి
పాయల మధ్య అతికిన తడితనమేదో
పురిటి వాసనేస్తూ వుంటుంది
నడక ఆగని నదీ ప్రవాహం
కొత్త నేలను హత్తుకుంటుంది
నువ్విప్పుడు నదిగా మారుతావా!
రాతి బొమ్మగా మిగిలి వుంటావా!!
(August 23)
నదిగా మారి సాగడమే శ్రేయస్సు
ReplyDeleteThank u manchi mata cheppaaru
Deleteబాగుంది వర్మగారు
ReplyDeleteThank u Yohanth
Deleteఎప్పటిలాగే బాగుంది
ReplyDeletemee raaka santhosham.. Thank u
Delete