నువ్వొక అబద్ధాన్ని వెతుక్కుంటూ
బయల్దేరుతావు!
నీటిపై నూనె మరకలా తేలియాడే
నవ్వు ఎదురవుతుంది!
గరకుగా అరచేతులతో మొఖాన్ని రుద్దుతూ
చలిని దాటిపోవాలనుకుంటూ!
టీ డికాక్షన్ లో ఆఖరి పంచదార పలుకు
చేదు గుళిక!
అరిపాదం కింద నలిగిన పక్షి
ఈక మూల్గుతూ!
దాహం నాలుకపై పారుతున్న
నదీపాయ ఇగిరిపోతూ!
కొండ పాదం కింద పగిలిన అద్దంలో
ఆకుపచ్చని నెత్తుటి మరక!
ఈ అసంబద్ద వర్ణ చిత్రం
అసంపూర్ణంగా!!
అరిపాదం కింద నలిగిన పక్షి
ReplyDeleteఈక మూల్గుతూ!
సార్ మీరే రాస్తారు ఇంత అధ్భుతంగా
ReplyDelete
ReplyDeleteటీ డికాక్షన్ లో ఆఖరి పంచదార పలుకు
చేదు గుళిక!వెరైటీ పదప్రయోగం మీకే సొంతం
Thank you all with <3
ReplyDelete