ఇప్పుడు నీకొక్కక్కటీ భారమౌతున్నాయి
ఒక్కొ క్షణమూ భారంగా కదలాడుతూ
నెర్రెలు బారిన అరచేతుల చాళ్ళ నిండా
అంటిన మట్టి పెళ్ళలుగా
నీ గోళ్ళ చివురున ఆరిన రంగేదో
తనను తాను కోల్పోయి
ఒక్కో అక్షరానికీ అంటని తడితనం
ముక్కలైన వాక్యంగా
మిగిలిపోనీ ఈ గది మూల
ఓ పక్కగా సేదదీరుతున్న గాలిలా!!
మార్గం యోచించండి
ReplyDeleteఇలా మిగిలిపోవాలి అనుకోవడం ఎందుకండి.
టైటిల్ గురించి వివరించ ప్రార్ధన
ReplyDelete