చుట్టూ హరివిల్లులా
ఇటువైపేదొ నలుపు తెలుపుల వర్ణ చిత్రం
ఆకాశమ్ నిండా కఫన్ లా
నువ్వొక్కడివే నిస్సహాయంగా
దుఃఖపు చినుకులా
వడి వడిగా జారిపోతున్నట్టు కాలం
పొడిబారిన మేఘంలా
తెగిపడిన చేతుల్నిండా యింత
దాహపు నాలుకలా
దేహమంతా చుట్టుకున్న నగ్న చర్మం
వలిచేస్తూ నువ్వలా
ఇంకొన్ని పూరేకులు దోసిలినిండా ఏరుకొని
ఈ రాళ్ళ దారిలో పరుచుకుంటు నేనిలా!!
ఆకాశం నిండా కఫన్ .....సూపర్బ్...
ReplyDeleteThank you Ghousuddin Shaik garu..
DeleteHAPPY NEW YEAR
ReplyDeleteక్రొత్త సంవత్సరంలో కవితతో అలరించారు చాలబాగుంది వర్మగారు.
ReplyDeletedhanyavaadaalu Sandhya Sri gaaru..
Deleteఇటువైపేదొ నలుపు తెలుపుల వర్ణ చిత్రం
ReplyDeleteఆకాశమ్ నిండా కఫన్ లా
నువ్వొక్కడివే నిస్సహాయంగా
దుఃఖపు చినుకులా...భలేగా రాసారు.
Thank you Padmarpitaji..
Delete