కాసేపు నిశ్శబ్ధాన్ని పాటిద్దాం
అక్కడెవరో రంగుల్ని కలుపుతున్నారు
బొమ్మను పూర్తి చేయనివ్వండి...
కాసేపు నిశ్శబ్ధాన్ని పాటిద్దాం
ఆయనెవరో ఉలిని చేతుల్లోకి తీసుకుంటున్నారు
రాతిని బొమ్మగా మారనివ్వండి...
కాసేపు నిశ్శబ్ధాన్ని పాటిద్దాం
అనంత సాగరం ఆకాశంతో మొరపెడుతోంది
చెవి ఒగ్గి వినండి...
కాసేపు నిశ్శబ్ధాన్ని పాటిద్దాం
రాతిని కోసుకుంటు సెలయేరు ప్రవహిస్తోంది
గలగలలను వినండి....
కాసేపు నిశ్శబ్ధాన్ని పాటిద్దాం
అడవి అంతా వెన్నెల పరచుకుంటోంది
కాసింత దోసిలి పట్టండి....
కాసేపు నిశ్శబ్ధాన్ని పాటిద్దాం
అక్కడేదో విత్తనం మొలకెత్తుతోంది
చిగురును కాపాడండి...
కాసేపు నిశ్శబ్ధాన్ని పాటిద్దాం
ఎవరో విముక్తి గీతాన్ని ఆలపిస్తున్నారు
గుండె గది తాళం చెవి తీయండి....
mee kavithalu chala bavunnai, mee blog nenu ee roje choosa, kavitha ki match ayye images pettaru avi kuda bavunnai,
ReplyDeletenanna meedha kavitha, ame adhivaram ala chepthe anni vastayemo mottam bavunnai
అజ్ఞాత : మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు..
ReplyDeleteకాసేపు నిశ్శబ్ధాన్ని పాటిద్దాం
ReplyDeleteఎవరో విముక్తి గీతాన్ని ఆలపిస్తున్నారు
గుండె గది తాళం చెవి తీయండి....
This itself is a poem varma gaarooo..thanx for giving us this ...
@విజయ్ కుమార్ గారు నా పంక్తులు నచ్చినందకు ధన్యవాదాలు సార్....
ReplyDeletevarma gaaru...కాసేపు నిశ్శబ్ధాన్ని పాటిద్దాం
ReplyDeleteఎవరో విముక్తి గీతాన్ని ఆలపిస్తున్నారు
గుండె గది తాళం చెవి తీయండి....simply great lines
@Anangi Balasiddaiah : Sir మీ ఆత్మీయతకు ధన్యవాదాలు...
ReplyDelete