కొన్ని గురుతులు అలా
కోనేటి గట్టున కోవెల గూట్లో దాక్కున్న
పావురం కువకువలులా మది గూడులో
ఎప్పుడూ పిలుస్తూనే వుంటాయి....
వెనక్కి పరుగెత్తలేని నిస్సహాయత
ఓ నిట్టూర్పులా విసురుగా రాలేక
గుండె పొరలలో సుడి తిరుగుతూనే వుంటుంది...
తను నా తరువాత పుట్టిందన్న మాటే గానీ
మా నానమ్మ ప్రతి రూపమన్న అయ్య మాటతో
నేలను దింప బుద్ది కాక చంకలో పీతికాయలు మొలిచాయి...
తను మారాం చేస్తే ఏంజేయాలో తెలియని తనంతో
అమ్మతో తిన్న చీవాట్లు....
అంత ముద్దు చేయకురా అది ఎవరి మాటా వినకపోతే
తిడతారురా నన్ను అంటూ విసుక్కునే అమ్మ మాటే వినపడ లేదు...
వున్నంతలోనే తనని ఒక ఇంటి దానను చేసేయాలన్న
తొందరతో కట్టబెట్టి పంపినప్పుడు మా ఇంట్లోనే కాదు
నా కళ్ళలో కూడా దీపాలు ఆరిపోయాయి...
తానిప్పుడు ఆరిందలా పెద్దరికంతో మాటాడుతుంటే
మళ్ళీ మా నానమ్మ గుర్తొచ్చి
కళ్ళు వెలుగును నింపుకున్నాయి....
ఈ రోజు బాల్య జ్ఞాపకాలు చుట్టుముట్టేస్తున్నాయి .
ReplyDeleteఅద్బుతంగా వుంది కవిత. అభినందనలు
@జాన్‌హైడ్ కనుమూరిః నే రాసి దాచుకున్న దానిని పోస్ట్ చేసేందుకు ప్రేరణనిచ్చింది మీరు అక్క పై రాసిన కవిత సార్..మీ అభినందనలు పొందడం ఆనందంగా వుంది...
ReplyDelete