ఇక్కడ గలగల పారే జీవనదులు
నాగావళి, వంశధారలతో పాటు
జంఝావతి, వేగావతి, గోస్తనీ,
చంపావతి, మహేంద్ర తనయ...
ఇంకా ఎన్నో ఎన్నెన్నో నదులు,
సెలయేళ్ళు, వాగులు, వంకలు
ఊటలు, పిట్టల కిలకిలా రావాలు,
పచ్చాపచ్చని అడవులు, సక్కని సుక్కలమల్లె పల్లెలు
సిన్నసిన్న పట్టణాలు, ఇసాకపట్నం నగరం,
ఇవన్నీ జూసి కన్నుకుట్టీ
బొగ్గు నిప్పుల కుంపట్లన్నీ
మా గుండెలపై రాజేస్తావా?
మా నెత్తిపై అణు బాంబునెత్తి
మా నేల పచ్చదనాన్ని భగ్గున మండిస్తావా?
మా సేపల వలలెత్తుకెల్లి
మరపడవలతో మా సంద్రం కడుపులో
దేవుకు పోతావా?
మా నట్టింట్లో కొచ్చి బంగరు
గనులన్నీ కాజేస్సి
మా కొండఫలాల్ని ఎత్తుకుపోయి
మా బూములన్నీ బుగ్గిజేసి
మా నీళ్ళన్నీ ఇసంజేసి
మా దీపాల్ని ఆర్పేయజూస్తావా?
మా బతుకులు సెడగొట్టడానికొస్తే
నీ పీక కోసి తలకాయ మా బొబ్బిలి
కోట గుమ్మానికి ఏలాడదీస్తాం!
కోటగుమ్మానికేలాడదీసి ఎల్లిపోయ్యొస్తం వంటి ప్రాంతీయ నుడికారాలు అంతిమ ప్రాసలుగా ఎలా ఉంటుందంటారు? ...నేను మీకు మీ స్వంత మాండలీకం గురించి సలహాలిచ్చెంతటి సాహసం చేస్తున్నందుకు అన్యధా భావించకండి.నూతక్కి రాఘవేంద్ర రావు.( కనకాంబరం.)
ReplyDeleteఎల్లిపోయొస్తం అంటే మళ్ళి వచ్చేస్తారు కదా గురూజీ.. మీకు తెలియనంత మాండలీకం కాదని తెలుసు.. నా గోస చదివినందుకు ధన్యవాదాలు..
ReplyDeletevaadi pani vaadu chakkagaa cheskuntunaadu-kaalpulatho,bomb pelullatho.mari mee pani -kota,thala eppudu?
ReplyDelete