Thursday, April 8, 2010

ఇట్లు మీ విధేయుడు-భరాగో సెలవు



ఇట్లు మీ విధేయుడు కథా సంకలనంతో అందరి హృదయాలలో శాశ్వత స్థానం ఏర్పరచుకొని తన 78 వ ఏట అందరి వద్ద సెలవు తీసుకొని వెళ్ళిన భరాగో లేరన్న వార్త తెలుగు సాహితీ లోకాన్ని శోక సంద్రంలో ముంచింది. తన సునిసిత హాస్య రచనలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన భరాగో (భమిడిపాటి రామగోపాలం) గారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలులు.

ఆయన వందకు పైగా కథలు, వంటొచ్చిన మగాడు, వెన్నెల నీడ నవలలు రాసారు. ఇట్లు మీ విధీయుడు కథా సంకలనంకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చి తనను తాను సత్కరించుకుంది. ఉన్నత మానవీయ సంబంధాలతో సాహితీ లోకాన ఆయన చేసిన కృషి మరువరానిది.

ఇక్కడ ఇట్లు మీ విధేయుడు చదవొచ్చుః
bhamidipati ramagopalam_Part1

4 comments:

  1. really so sad!i am very fond of his writings,more after when i saw them as a series in dhoordarshan.may his soul rest in peace.

    ReplyDelete
  2. భరాగో- భమిడిపాటి రామగోపాలం అంతిమయాత్ర చిత్రాలు ఇక్కడ చూడగలరు
    http://wp.me/pPLDz-Up

    ReplyDelete
  3. హితుడా ఇక శెలవు. నీవులేవు. నీ మాట ఉంది. నీవు లేవు. కానీ మేము నవ్వుకుంటున్నాము. చూశావా? మా తెంపరితనం?

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...