Monday, May 18, 2009

తమిళ ఈలం పోరాటం ఫేనిక్ష్ పక్షిలా మళ్ళీ లేవాలని

శ్రీల౦క లో తమిళుల దుర్భర జీవితానికి పరాకాష్ట. గత కొన్ని సంవత్సరాలుగా వారిపై జరిగిన నిరంకుశ దాడి. తమిళ ఈలం పరిష్కారంగా ఎల్.టి.టి.ఈ. వారు చేస్తున్న పోరాటం ముగింపునకు చేరుకున్నదని లంకేసుడు ప్రకటించడం వారి దాష్టీకానికి గుర్తు. కాని ప్రజల మనసులనుండి అంత తొందరగా జరిగిన అన్యాయపురిత దాడిని చెరిపెయగలరా. ప్రజా పోరాటాలకు ముగింపు సైనిక చర్యల ద్వారా పలకలేరనేది చారిత్రిక సత్యం. భారత పరిపాలక వర్గాలు ఈ విషయాన్ని సన్నాయి నొక్కులు నొక్కుతూ తమ ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు. ఒక పరాయి దేశంలో తమ సంతతికి చెందిన జనావలిపై రాక్షస దాడి జరుగుతుంటే కళ్లు మూసుకున్న దేశం మరోటి వుండదేమో. తమ భూభాగంలో ఉగ్రవాద నిర్మూలన పేరుతొ జనన హననాన్ని సృష్టిస్తుంటే కనీసపు చర్యలైనా తీసుకొని నిర్దయ పూరిత పాలక వర్గాన్ని కలిగివుండడం మన దురదృష్టం. పులులు చేసిన పోరాటం హిన్సాత్మకమైనదే కావచ్చు. కాని ఆ పేరుతొ ఎన్నో లక్షల మంది సామాన్య అమాయక ప్రజలు బలికావడం, దానిని చూస్తూ కుడా సభ్య ప్రపంచం కళ్లు ముసుకోవడం, కంటి తుడుపు చర్యల అమెరికా వాడి మానవ హక్కుల సంఘాలు అరవడం తప్ప దానిని ఆపేందుకు ఎవడు కృషి చేయక పోవడం వెనక ఎవరి వ్యాపారాలు వాళ్లకు వున్నాయనేది స్పష్టమౌతోంది. రాజీవ్ గాంధీ హత్యను సాకుగా చూపించి అక్కడి మొత్తం తమిళ జాతినే నాశనం చేసేందుకు సహకరించిన భారత ప్రభుత్వం దమన నీతిని మానవత్వం వున్నవారు తప్పనిసరిగా ఖండించాలి. అసలు పులుల ఆవిర్భావం ఈ దేశ రా సహకారంతోనే మొదట జరిగిందనేది జగమెరిగిన సత్యం. శాంతి పరిరక్షణ పేరుతొ వారిపై యుద్ధానికి వెళ్ళింది వీళ్ళే. కడుపు మండే వాడు అంత కంటే ఏమి చేస్తాడు. భారత్ లో కూడా కుటిల చాణక్య పరిపాలనలో భింద్రన్ వాలేలను సృష్టించి తమ పబ్బం గడవగానే అంతమొందించి ఎంతో మంది సిక్కు యువకులను బలిగొన్న చరిత్ర మన పాలకులది. అన్నీ తెలిసిన వారు కుడా మౌనం దాల్చడం మన దౌర్భాగ్యం. అమ్ముడుపోయిన మన సార్వభౌమత్వానికి నిదర్సనం. మరణించిన వీరులకు నా హృదయాంజలి ఘటిస్తున్నాను. వారి నిస్వార్ధ పూరిత పోరాటానికి, త్యాగానికి జోహార్లు తెలియచేస్తున్నాను. మరో ఈలం పోరాటం మొగ్గ తొడిగి తమల సోదరుల కల నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

2 comments:

  1. I am also fan of Velupillai Prabhakaran. ఒక సింహం చనిపోతే మరో సింహం పైకి రావాలని కోరుకుందాం. ప్రభాకరన్ బతికే ఉన్నాడు అన్న ఆశ నాలో ఇంకా ఉంది కానీ అతని కొడుకు చార్లెస్ చనిపోయాడన్న వార్త నాకు బాధ కలిగించింది.

    ReplyDelete
  2. ప్రభాకరన్ చనిపోయాడు. బాలసింగం, మరికొందరు ప్రముఖ నాయకుల శవాలు కూడా దొరికాయి. అహింసావాద బౌద్ధ మతం పేరు చెప్పి దారుణ నరసంహారం చేసేవాళ్ళు యుద్ధంలో గెలవడం చాలా పెద్ద ట్రాజెడీ.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...