ఇప్పుడు మూసుకుపోతున్న దారులను
తెరచే పని చేయాలి
ఒక్కో నదినీ ముక్కలు చేస్తూ ఎక్కడికక్కడ
గోడలు కడుతున్నాడు వాడు
ఇప్పుడు నదీ ద్వారాలను స్వేచ్చగా
తెరచుకోనివ్వాలి
ఒక్కో పర్వతాన్నీ పిండి చేస్తూ వాడు
గుండెల్ని తవ్వి ఎత్తుకు పోతున్నాడు
పర్వత పాదాలతో పాటు శిఖరాన్ని
నిబ్బరంగా ఎదగనివ్వాలి
నిటారుగా దారు వృక్షాలతో కలకలలాడుతున్న
పచ్చని అడవిని నరుక్కుపోతున్నాడు వాడు
నేల లోతుల్లోకి వేళ్ళని జొనుపుతూ ఆకాశాన్ని
అందుకునేలా పాతుకోనివ్వాలి
సాగర తీరాన ఇసుక లోతుల్లోకి చొరబడి
అలలనే మింగేయడానికి వస్తున్నాడు వాడు
గర్భంలోంచి ఎగసిపడే అలల కెరటాలను
తీరందాకా చేరనివ్వాలి
నిన్నూ నన్నూ మాంత్రిక పాచికలతో జూదరులను చేస్తూ
వాడు ఉనికినే తుంచుకుపోతున్నాడు
నేలను ఆనిన పాదాలతో వాడి గుండెలపై
ఎగిరి తన్ని తరిమేయాలి
అధ్భుతంగా వ్రాశారు సార్
ReplyDeleteThanksandi..
Deletevery nice sir.
ReplyDeleteVERY GOOD
ReplyDeleteసాగర తీరాన ఇసుక లోతుల్లోకి చొరబడి
ReplyDeleteఅలలనే మింగేయడానికి వస్తున్నాడు వాడు
Excellent Varmagaru
Thank you Prerana garu
Deleteనేల లోతుల్లోకి వేళ్ళని జొనుపుతూ ఆకాశాన్ని
ReplyDeleteఅందుకునేలా పాతుకోనివ్వాలి
నేలను ఆనిన పాదాలతో వాడి గుండెలపై
ఎగిరి తన్ని తరిమేయాలి
విద్వంసం లోపల కూరుకుపోయిన మనిషి పట్ల
మీ కెంతటి విశ్వాసం
Viswasame jivitaniki bharosa kada Sir.. Thank you very much..
Deleteగర్భంలోంచి ఎగసిపడే అలల కెరటాలను
ReplyDeleteతీరందాకా చేరనివ్వాలి
నిన్నూ నన్నూ మాంత్రిక పాచికలతో జూదరులను చేస్తూ
వాడు ఉనికినే తుంచుకుపోతున్నాడు...బాగుంది
This comment has been removed by the author.
ReplyDelete