Wednesday, April 9, 2014

స్పర్శ..


అప్పుడప్పుడు రాతి బొమ్మలా మారి
నిర్వికారంగా మిగిలిపోతే

ఆ కాలమంతా స్తంభించి
నిశ్శబ్దం ఆవరిస్తే

ఏదీ వినపడనితనం
కమ్ముకుంటే

ఆ క్షణాలన్నీ నిన్ను నువ్వు
పరికిస్తే

నీలో ఓ చిగురాకు
స్పర్శ

కాసింత
డి
సి
ట్టు
కో
ని

8 comments:


  1. "ఏదీ వినపడనితనం
    కమ్ముకుంటే

    ఆ క్షణాలన్నీ నిన్ను నువ్వు
    పరికిస్తే

    నీలో ఓ చిగురాకు
    స్పర్శ" -

    మీ కవితల్లోని భావాలతో పాటు,
    మీ శైలీ నచ్చుతుంది నాకు .

    బాగుందండీ వర్మ గారు మీ కవిత .
    *శ్రీపాద

    ReplyDelete
  2. మీరు బాగారాస్తారు సార్

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానం నా చేత రాయిస్తుంది యోహాంత్ గారు. ధన్యవాదాలు..

      Delete
  3. Replies
    1. ధన్యవాదాలు మాయా విశ్వం గారు..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...