ఇది ఆది నుండి
అందరి గొంతులో దిగబడుతున్న
కర్కశ శూలం
తట్టుకోలేనితనంతో
అంతా దానిని పాతరేయజూస్తుంటే
మరల మరల అది
నిటారుగా మొలుస్తూ
జూలు విదిలించి
తన కొక్కేనికి నీ పీక
తగిలిస్తోంది...
ఎంత ఓర్చుకోలేనితనం
ఒక్కమారుగా గుంపుగా మందలా
పడి దాన్ని నలిపేయ నమిలేయ
జూస్తే పళ్ళమధ్య ఇరుక్కొని
కుక్క ఎముకను
కొరుకుతూ తన పళ్ళసందుల
కారే నెత్తురు రుచికి ఆహా అనుకున్నట్లు
తన్మయత్వంలో వున్నావా?
ఆగాగు
యుగాలుగా దానిని ఉరితీసిఊపిరి పీల్చుకుందామనుకుంటే
అది నీ మెడ చుట్టూ
బిగుసుకుంది చూడు...
(ఆదివాసీ హక్కుల కార్యకర్త డా.బినాయక్ సేన్ పై మోపబడ్డ దేశద్రోహ నేరమూ-శిక్షకు వ్యతిరేకంగా)
prashnaku samaadaanam cheppakundaa ,prashninchE vaallanu sikshistE adhi inko prashna avuthundhi -adhi chivariki maanavatvaanni,prajaasvaamya ashthitvaanni prashnaarthakamu chestundhi.dr.bhinayak sen gaarini vidudhala cheyaalani koruthoo....
ReplyDeleteAre you the writer of book "ఉక్కుపాదం"? what is the orginial english book for that one?
ReplyDeleteveera గారూ కాదండీ. ఇది నా బ్లాగు పేరు మాత్రమే ఆయన గుర్తుగా పెట్టుకున్న. ఆయన కిందటేడాది అమరులయ్యారు. చాలా గొప్ప అనువాదకులు. original english novel viz. The Iron heel. Writer was Jack London. see this link http://en.wikipedia.org/wiki/Jack_London
ReplyDeleteThank you
ReplyDeleteతట్టుకోలేనితనంతో
ReplyDeleteఅంతా దానిని పాతరేయజూస్తుంటే
మరల మరల అది
నిటారుగా మొలుస్తూ
జూలు విదిలించి
తన కొక్కేనికి నీ పీక
తగిలిస్తోంది...