Tuesday, November 23, 2010

కవిత్వంతో ఎగసిపడిన 'అల' హఠాన్మరణ౦....


ఎక్కడ సాహితీ సభలు జరిగినా తప్పక హాజరై తన కవితను వేదికపై వినిపించే 'అల' మధ్యాహ్నం కామెర్ల వ్యాధితో బాధ పడుతూ చనిపోవడం ఉద్యమ కవితా రంగానికి, ఉత్తరాంధ్ర సాహితీ మిత్రులకు తీరని నష్టం. మినీ కవితలు చాలా రాసిన 'అల' జనసాహితీ నిర్మలానంద గారి ప్రోత్సాహంతో దీర్ఘ కవితలు రాయడం ఆరంభించి మద్యనే నిప్పులవాగు, మట్టిచెట్టు పిట్ట బజినిక, అలల సవ్వడి అన్న దీర్ఘ కవితా సంకలనాలు ప్రచురించారు. మృదు స్వబావిగా, ఎప్పుడూ చిరునవ్వుతో పలుకరించే అల తన కలం ద్వారా రాజ్యం పట్ల, దాని అణచివేత ధోరణి పట్ల తీవ్ర వ్యతిరేకతను, ప్రజా ఉద్యమాల పట్ల సానుభూతిని, అణగారిన వర్గాల పట్ల ఆప్యాయతను కలిగివుండే వారు. తన సొంతవూరు అన్నంరాజు పేటలో చిన్న స్కూలును నడుపుతూ సాధారణ జీవితం గడుపుతూ తన కవితల ద్వారా, రచనల ద్వారా సాహితీ మిత్రులతో పాటు ఇక్కడి ప్రజల ఉద్యమాలలో పాలుప౦చుకు౦టూ అందరికీ చేరువైన వారు. అనారోగ్యంతో ఇలా అందరినీ విడిచి పోవడం ఎవరికీ నమ్మశక్యంగా లేదు. 'అల' కలల సవ్వడి ఇంత హఠాత్తుగా ఆగిపోవడం మాకు తీరని బాధను మిగిల్చింది.
అల
కవితా వాక్యాలు కొన్ని:
నాగలి మేడిని
అదిమిపెట్టే వేలే
తెల్లకాగితం మీద
ముద్ర వేసినప్పుడు
కొరడా కర్రని
బిగిసిపట్టిన చెయ్యే
అప్పులకోసం అర్రులు చాచినప్పుడు

యుద్ధం అనివార్యం..


. విత్తనం కడుపులో స౦కర౦ సు౦కు పుట్టి౦ది
బహుళ
జాతి బలాత్కరి౦చి
టెర్మినేటర్ ఎబార్షన్ చేసి0ది

రైతు స0క్షోభం సర్వవ్యాప్తమై

మట్టిని మేల్కొలిపి0ది...


ఇప్పుడు
మన యుద్ధం
ఒక్క
బుగత మీదే కాదు
బుగతకు బాసటగా వున్న
రాజ్యం మీద మాత్రమె కాదు
మన
ఆలోచనల మీద,
మన సంస్కృతి మీద
సాగుబడి మీద,
మన వృత్తుల మీద

మన వ్యాపారం మీద,
మన సకల ఆహారపు అలవాట్ల మీద

చావుదెబ్బతీశాడే...
వాడిమీద,
వాడి కుట్ర మీద
యుద్ధం చెయ్యాలి..

ఇలా
రాజ్యం, దానికి వత్తాసుగా వున్న సామ్రాజ్యవాద౦ మీద తన యుద్ధాన్ని ప్రకటి౦చిన 'అల' తన యుద్దాన్ని ఇలా అర్థా౦తర౦గా వదిలేసి వెళ్ళిపోవడం సాహితీ ఉద్యమానికి ఆశనిపాతం.. తను జన సాహితీ సంస్థ బాధ్యతలలో వున్న మిగతా సాహితీ సభలకు అలాగే విరసం సభలకు కూడా హాజరై తన స౦ఘేభావాన్ని, మిత్రత్వాన్ని కొనసాగించే అల ఇలా దూరమవ్వడం బాధాకరం..

జోహార్
కా.అల...
కా
.అల ఆశయాలను కొనసాగిద్దాం...

Wednesday, November 17, 2010

అరుణతార జూలై - సెప్టెంబర్ సంచిక



అరుణతార విరసం అధికార పత్రిక. ఈ పత్రిక ఇంత ఆలస్యంగా రావడానికి కారణం ఆర్థికపరమైన వెనుకబాటు. సాహితీ మిత్రులు, పాఠకులు మీ విరాళాలతో, చందాలతో పత్రికను ఆదుకొనగలరని ఆశిస్తూ..

చందాలు, విరాళాలు ఈ చిరునామాకు పంపగలరుః
ఎస్.రవికుమార్,
5-1307,
దొరసానిపల్లె రోడ్,
ప్రొద్దుటూరు,
కడప జిల్లా - 516 360
Mobile No.:9866021257

రచనలు ఈ చిరునామాకు పంపించి పత్రికకు సాహిత్యపరంగా తోడుకాగలరుః

డి.వి.రామక్రిష్ణారావు,
M.I.G.-14, APIIC colony,
Opp. Corbide Company
Moulali,
Hyderabad - 500040.

Email: arunatara1977@gmail.com

Arunatara July-Sep2010 Final

Sunday, November 7, 2010

మాయల ఫకీరులు




ఏదో ఓ పెద్ద సునామీ కెరటం
ముంచెత్తడానికి
ముందున్నట్లు ఈ ప్రశాంతత..

ఆకాశమంత కమ్ముకున్న
మబ్బులు రైతన్న
మోముపై చూస్తూ
భూమిలోకి కుంగిపోతున్న
అనుభూతి...

కోతకొచ్చిన పంట 'జల'
వరదపాలౌతుందన్న
బెంగతో గొంతులో
ముద్ద దిగక
ఊపిరాడనితనం...

ఇంతలొ...

ఓ అరచేయి అందరి
నెత్తిపై గట్టిగా మోదుతూ
మోకాళ్ళపై మోకరిల్లమని
ఆజ్నాపిస్తున్నట్లు...

నోటికందిన ముద్దను
నల్లరెక్కల గెద్ద ఏదో తన్నుకు
పోతున్నది!

రెక్కలకింద దాగిన పిల్లలను
మరింతగా దాచుకునేందుకు
ఒదిగిపోతున్న కోడి
ఈకల సందుల్లో దూరుతున్న
సాటిలైట్ చూపుతో
సిగ్గుతో చచ్చిపోతున్నది..

మూసుకుపోతున్న
బాహ్య ఆధార దారులతో
నిరుద్యోగి గుండె సంద్రమౌతున్నది..

ఇక్కడి ధాతువులన్నీ
చాప చుట్టే పన్నాగంతో
వచ్చిన ఈ మాయల ఫకీరు
చిలకను కొట్టేందుకు
శిలకోలలెక్కుపెడుదాం...
Related Posts Plugin for WordPress, Blogger...