Wednesday, September 9, 2009

ఎలాగోలా….

ఎలాగోలా బతికేయడానికి అలవాటుపడ్డాం

ఎవరేమనుకున్నా సరే

మనం, మన కుటుంబం, మన మోటారు సైకిలు/కారు

మన సెల్ బాలంస్, మన ఏ.టి.ఎం. కార్డు బాలెంస్

ఉంటే ఎవరెలా పోతే నాకేంటి,

నా పిల్లవాడి కాన్వెంట్ సీట్/కార్పొరేట్ కాలేజి చదువు

దొరికితే చాలు..

మంచి – చెడుల మద్య నున్న సన్నటి తెరను

చించేసుకుని బురఖాగా వాడుకుంటూ

నెపం ఎవరిమీదకో నెట్టేస్తూ

రోలింగ్ స్టోన్లా రోజులు దొర్లించేస్తున్నాం!

నిత్యం ఆత్మను చంపుకుంటూ చస్తూ బతుకుతున్న

బతుకూ ఒక బతుకేనా అని అర్ధరాత్రి

దుప్ప్టట్లో ప్రశ్నించుకొని తెల్లారి

మరల నుదుట నామంతో ప్రత్యక్షమవుతుంటాం!

ఎన్నాళ్ళీ మోసకారి బతుకులు?

అతకని మనసుల జతలు..

ప్లాస్టిక్ పువ్వుల నవ్వుల రువ్వులు..

8 comments:

  1. ఎన్నాళ్ళంటే మనం బతికినంత కాలం లేదా మనం మారాలని నిర్ణయించుకోనంత కాలం. :-) బాగా చెప్పేరు అంతర్లీనమైన మన ఆవేదన..

    ReplyDelete
  2. హ్మ్ life is like that. isnt it?

    ReplyDelete
  3. భావన గారు నా ఆవేదనకు సహానుభూతి తెలియచేసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  4. బాబా గారు జీవితాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో కలిగిన ఆవేదన.మీరు కామెంట్ రాసినందుకు ధన్యవాదాలు. మీరు నా మిగిలిన కవితలు చూసినందుకు థాంక్స్.

    ReplyDelete
  5. "దాలిగుంటలో కుక్క" కథ వినేవుంటారు. వినటానికి నిష్ఠూరంగా వున్నా సగం బ్రతుకంతే. సగం జీవితం ఆచరణకి ఆలోచనకి ఆశయానికి నడుమ అంతరాన్ని తరిచి చూసుకుని వగచటంలోనే గడిచిపోతుందేమో? అయినా నాణేనికి రెండో వైపు వున్నట్లే జీవితానికీ మరో అర్థంవుంటుంది. నా వరకు నా ఆథ్యాత్మిక జీవితం ఈ దైనందిన జీవితాన్ని సమతుల్యం చేసే మార్గం. మీకు మరొకటి వుండొచ్చు. ఈ వేదన వుందంటే బయటపడేసే ఆ మార్గమూ మీలోనేవుంటుంది. మీ కవిత మొన్ననే చూసానండి, ఈ తీరిక చిక్కాక వ్రాయాలని ఆగాను.

    ReplyDelete
  6. ఉషా,
    బాగా గుర్తు చేశారు. రాత్రే "దాలిగుంటలో కుక్కలు" కథ చదివాను. అనుకోకుండా ఇవాల వర్మ గారి కవిత చదివి సరిగ్గా కోట్ చేశారు మీరు.

    వర్మ గారు,
    సగటు మనిషి ప్రతి రోజూ రాత్రి పడుకోబోయే ముందు అనుకునే స్వగతమే మీ కవిత!

    ఎన్నాళ్ళీ బతుకులు...?
    బతికినంత కాలమూనూ!

    కానీ అవుట్ లెట్ అంటూ ఏదో ఒకటి ఉండకపోదు కదూ!

    ReplyDelete
  7. నిజంగా మనది స్వార్థ, సంకుచిత, ఆత్మ వంచన జీవితం

    ReplyDelete
  8. నాగరాజుగారు మీ స్పందనకు ధన్యవాదములు...

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...