Wednesday, April 22, 2009

గాయాల చికిత్సాలయం


చీకటి చీకటి చీకటి


జీవితపు పేజీల నిండా తారు పులుముకుంటూ


మెదడు పొరలను చీకటిమయం చేస్తున్నవాన్ని


ఎంతైనా చీకటి గాయాల చికిత్సాలయం కదా!



తల్లి గర్భంలో వలె మళ్ళీ నన్ను


ఉమ్మనీరులో ఈదులాడే శైశవ


అనుభూతిలో తెలియాదిమ్చేఅమ్మ


చీకటి...


రకరకాల బురఖాలనేసుకు౦తు


నవ్వులు ఏడ్పులు అరమోద్పులతో


మోసగిస్తున్న మాయాజలతారు మార్మికత


నుంచి దూరం చేస్తూ మంచు తెరల మాటున


నన్నుదాస్తూ మరపిస్తూ లాలిస్తున్న నెచ్చెలి


చీకటి.....


మిమ్మల్నందర్నీ వెలివేస్తూ


ఓడిపోయిన నా ఎదలోపలి గాయాలను


చల్లగా స్పృశిస్తూ తన నల్లని


రెప్పల పరాదాలమాటున


ప్రేమగా నిద్రపుచ్చే చెలి


చీకటి...


మబ్బుల మాటున దాగిన


చందమామను నేను...

Friday, April 17, 2009

విధ్వంసం ఆవలి వైపు

ఇప్పుడు నేను కవిత్వం
రాయలేకపోతున్నాను

నా అక్షరాల మాటున దాగిన
సన్నని దారాన్ని ఎవరో
పుటుక్ పుటుక్ మని తెంపుతున్న శబ్ధం......

నా చుట్టూ ఎవరో సమాధి రాళ్ళను
చక చకా పేర్చుతున్న దృశ్యం
తెరలు తెరలుగా నా కళ్ళముందు.....

గుండెలపై టన్నులకొద్దీ బరువైన ఇనుప
దిమ్మెలను పేర్చుతు౦టే
పట పట మని విరిగిపడుతున్న
ఎముకల శబ్ధం...

కూరుకుపోతున్న దుర్గంధమయ ఉబిలోను౦చి
శ్వాస కోసం నా ముక్కు పుతాలను
పైకి లాక్కు౦టూ.....

కానీ
చివరాఖరకి తూర్పు ను౦డి ఒక సన్నని
గాలి తిమ్మెర నన్ను తాకుతూ...
Related Posts Plugin for WordPress, Blogger...