Sunday, August 14, 2016

ఎవరో...


 ఒకరెవరో ఏమవుతారో
అలా ఒకసారి కరచాలనమిస్తారు
ఒక మాట కలుపుతారు
మరల మరల
కలుసుకోవాలని
కలబోసుకోవాలని
వెన్నాడుతూ ఉంటుంది!

అయినా
మరల ఒక కలయిక
కలగానే మిగిలి
ఒక రాతిరిని కొన ఊపిరిగా
రెక్కలూడిన తూనీగలా
మిగిలిపోనిస్తుంది కదా!

ఒక ఆశ వెన్నాడుతూ
నీ గుండె జోలెలో
ఖాళీగా వెక్కిరిస్తూ
వెను తిరిగి చూస్తే
ఒక ముక్కలైన స్వప్నమేదో
పగిలిన అద్దంలో!!

9 comments:

  1. ఒక ఆశ వెన్నాడుతూ
    నీ గుండె జోలెలో..మనసుని హత్తుకునే వ్రాతలు

    ReplyDelete
  2. ఎప్పటి వలనే అర్థవంతమైన అక్షరాలు మీవి

    ReplyDelete
  3. హృదయాన్ని సున్నితంగా తాకింది మీ ఈ కవిత వర్మ గారు.. పగలిన అద్దం ఎక్స్ ప్రెషన్ గుండెను హత్తుకుంది.. ఫెల్ట్ లిటిల్ ఎమోషనల్ సర్..
    చిన్న చిన్న అక్షరాలలో పెద్ద పెద్ద భావాలను అమర్చి అలరించటం మీకు "మొజరెల్ల తో పెట్టిన పిజ్జా" వంటిది.. హాస్యానికి మార్చి వ్రాసాను..!

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...