దూరంగా ఎన్నెలో ఎన్నెలా
అని ధింసా ఆడుతున్న పగిలిన పాదాలు
నెగడు చుట్టూ ఎగురుతున్న ఉసిళ్ళు వలె
ఆలోచనల కదలికలును పసిగట్టు చూపులు
చలిగాలికి కాసింత చల్లబడుతున్న కార్బన్
అరచేతికి తగులుతూ కాషనిస్తోంది
ఎండిన మోడు నీడ మేఘంతో పాటు
అటు యిటూ కదులుతూ ఉలికిపడుతోంది
ట్రిగ్గర్ పై చూపుడు వేలు బిగిస్తూ
ఈ ఎన్నెల మరింత ఎరుపెక్కుతూ ధారగా కురుస్తోంది
రెప్ప పడని కాలం సెకన్ల ముళ్ల చివర
టక్ టక్ మని తిరుగుతూ ఎలర్ట్ చేస్తోంది
పారాహుషార్ కామ్రేడ్
పారాహుషార్
ట్రిగ్గర్ పై చూపుడు వేలు బిగిస్తూ
ReplyDeleteఈ ఎన్నెల మరింత ఎరుపెక్కుతూ ధారగా కురుస్తోంది..మీ రాతల్లో పదును బాగుంటుందండి
Thank you Amrutavalli garu
Deleteసార్ ఏంటి ఈ మధ్య పోస్ట్లు మునపటిలా రాయడంలేదు. తగ్గించేసారు
ReplyDeletebaddhakam yekkuvai Aniketh..:-)
ReplyDelete