Wednesday, February 29, 2012
వెతుకులాట.....!
ఇక్కడేదో పోగొట్టుకున్నాను అని మనసులో గుబులు...
దిగంతాలు వెతికినా కానరాదేమీ......
పోగొట్టుకున్నదేదో తెలియనిదే ఏమని వెతకను.....
ఆగని ఆరని వెతుకులాట.....
చేతిలో లాంతరు పొగ మారి మసక బారుతున్నా
దేహమే ఓ నేత్రమై వెతుకుతున్నా....
లోలోపల గాఢమైన సాంద్రమైన సంద్రంగుండా
అలల తెప్పలపై కదులుతూ....
అమేయమైన దీర్ఘ నిర్నిద్ర రాత్రుల గుండా
చీకటి సాలెగూడు తెరలను తెంపుకుంటూ.....
నేతగాని మునివేళ్ళ మధ్య గుండా
విడిపోతున్న దారాల ముడులులా....
సుడిగుండాల మధ్య నుండి
పైపైకి దూసుకు వస్తున్న వేటగానివోలె......
సన్నని వెన్నెల కిరణమొకటి రహస్య దారుల గుండా
ప్రభవిస్తూ....
Subscribe to:
Post Comments (Atom)
వెన్నెలకిరణం నేతగాని దారాల ముళ్ళు విప్పి సుడిగుండాల నుండి బయట పడేస్తుందో లేదో కానీ...
ReplyDeleteకలలనేతనుకున్న ప్రేమతరంగాన్ని మీ కవితా వెల్లువతో వెన్నెలదారిగా మైమరపిస్తున్నారు:-)
ధన్యవాదాలు పద్మార్పితగారు అంతా మీ సాహిత్యాభిమానం...యిలా ఆప్త వాక్యంతో ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలండీ...:-)
Deleteమీ కామెంట్ బాగుందండి పద్మార్పిత గారు.
ReplyDeleteరెడ్డిగారూ యిలా నా రాతలు వైపు వచ్చినందుకుకు ధన్యవాదాలండీ..
Deleteచేతిలో లాంతరు పొగ మారి మసక బారుతున్నా
ReplyDeleteదేహమే ఓ నేత్రమై వెతుకుతున్నా....
ఇంతలో సన్నని వెన్నెల కిరణమొకటి రహస్య దారుల గుండా వెలుగురేఖలు నింపుతూ.......
చాలా బాగుంది సార్ వర్ణన..
సుభగారూ ధన్యవాదాలండీ..
Delete