Tuesday, July 26, 2011

ఓ గురుతు




ఓ గురుతు

నిన్నో మొన్నో చూసినట్టుగా వుందిప్పటికీ...

ఆ నవ్వు అమావాస్య వేళ ఓ వెన్నెల
సంతకం

మాటాడుతుంటే సెలయేళ్ళ గల గలలకే అసూయపుట్టేలా కతల
ఊట...

చుట్టూ పూల రేకుల నవ్వుల
వాన....

గొప్ప నమ్మకమిచ్చే ఆ కరచాలనపు
స్పర్శ....

కలల పందిరి కింద వెన్నెల క్రీనీడల
సరాగం....

మనసంతా కమ్ముకున్న ఓ ఆనంద
తాండవం....

4 comments:

  1. @చెప్పాలంటే...భావం ఎప్పుడూ అసంపూర్తిగానే మిగిలిన ఓ తీపి గురుతు కదా మిత్రమా...

    ReplyDelete
  2. navvu...maaTa...sparsha...manassu.....ivEnaa saar ...gurutulu

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...