పాడుకాలం...
విరామంలేని మృత్యు ఘంటికలు
ఖణఖణ ఖణఖణ ఫెళఫెళలు
దగ్గరి వారో దూరం వారో
ఒక్కో చావూ నీ దగ్గరి
మనిషితనాన్ని మింగేస్తోంది
ఇప్పుడు రోజువారీ లెక్కలే
తప్పుడు లెక్కలలో ఎక్కడో
తప్పిపోయిన దేహాలు
గుండె చీల్చుకు వచ్చే
దుఃఖం గొంతు దాటి రాక
ఏదో లోయలో కూరుకు పోతున్నట్లుంది
ఒకరికొకరు సాంత్వన చెప్పుకునే
మాటలు దొరక్క ఎవరికి వారు
ఒంటరి ఆకాశంలో రెక్క తెగిన పక్షిలా
బంధాలు అనుబంధాలు చెరిపేయబడి
ఒక్కొక్కరూ ఒక ఐసీయూలో బంధించబడి
దిక్కులేక పలుకులేక బేలచూపులతో
ఇంకా ఎంతకాలమీ పాడుకాలం
తప్పని ఈ ఎడబాటు
ఎండమావులా బిక్కు బిక్కుమంటూ!!
(7-5-2021)11.09PM