Showing posts with label కవిత అంతరంగం. Show all posts
Showing posts with label కవిత అంతరంగం. Show all posts

Saturday, April 21, 2012

కళ్ళెం వేస్తూ...



ఇలా ఏదో వ్యక్తావ్యక్త
భావనతో... 

మనసును గిలిగింతలు పెట్టినట్టే
అనిపించి
మరల మరల
ముద్ద మందారంలా
ముడుచుకు పోతావు!

ప్రియా!!!
తప్పు ఒప్పు
ఇవి రెండూ
దేనికవే నిలబడలేని
నిలకడలేని సత్యాసత్యాలు కాదా!

మనకొరకు మనం
జీవించలేని
జీవనం సాగి
స్తూ...
చట్రంలో ఇరుక్కుపోతూ...

బోనెపెట్టెలో చిక్కుకున్న
ఎలుకలా తప్పించుకోలేనితనం
వెక్కిరిస్తూ నిలుచున్నప్పుడు
నిస్సహాయంగా సంకెళ్ళు వైపు
చేతులు చాస్తూ...

ఒరిసిన గాయం పెట్టే
బాధలోనే రసాన్ని ఆస్వాదిస్తూ...

ఏదీ ఇంకలేదన్న తనాన్ని
గుండెకు అద్ది...
అలా నేలబారుగా ఒత్తిగిల్లి
ఓ దీర్ఘ నిద్రలో కూరుకుపోవడమేనా!

Monday, December 19, 2011

ఆమె.. నేను??

ఎదురెదురుగా రెండు బండరాళ్ళు!
ఆమె..
నేనూ...

ముందుగా ఎవరు కదిలిస్తారోనని
ఒకరికొకరు ఎదురు చూపు...

కరిగిపోవడానికి సిద్ధమై
కూచున్న రాళ్ళు...

కదిపేది ఎవరు?
కదిలించేది ఎవరు??

కాలం మంచుగడ్డై
ఉషోదయం కోసం ఆత్రంగా...

ఇన్ని బలహీన క్షణాలు
కరిగిపోతూ చుట్టూ
పొడిబారిన ఆవరణం...

కదలని దేహాలు
కరగని ఆత్మలు
చుట్టూ వలయాలుగా
పరిభ్రమిస్తూ
విసుక్కుంటూ!

బ్రద్దలవుతుందేమోనన్న
సందేహం వదలని
భేతాళునిలా భుజంపై
వేలాడుతూ
మౌనంగా శపిస్తూ...

ఆ అసంకల్పిత
ప్రతీకార చర్యను
ప్రేరేపించేది



రు?
ఎప్పటికి???
Related Posts Plugin for WordPress, Blogger...