కాసేపలా నడిచి వద్దాం
ఏకాంతంగా
ఒకరిలోకొకరిగా
ఎవరికి వారుగా
చల్లగా కాలికింద ఇసుక
మెత్తగా నలుగుతూ
వేసిన ముద్రలు కరుగుతూ
రెండు వెదురు ఆకులు
ఒకటికి ఒకటి
నిశ్శబ్దంగా రాసుకుంటున్నట్టు
కాసేపలా నడిచి వద్దాం
ఒకరిలోకి ఒకరు
తొంగి చూస్తూ
పెదవి దాటని రాగమేదో
పల్లవిగా సుళ్ళు తిరుగుతూ
మౌన చరణాలుగా
రెండు పావురాళ్ళ
గుర్ గుర్ శబ్దాల
ఆలాపనల మద్య పలకరింపులా
కాసేపలా నడిచి వద్దాం
నీరెండనింత దోసిలిలో పట్టి
ఒకరిలోకొకరు
ఇంకుతు వెచ్చగా
తల్లి కాళ్ళ మద్య విశ్రమిస్తున్న
ఆ కుక్క పిల్లలులా
మెడ అంచున చేతులు మెలిక వేస్తూ
.
.
.
.
కాసేపలా...
ఏకాంతంగా
ఒకరిలోకొకరిగా
ఎవరికి వారుగా
చల్లగా కాలికింద ఇసుక
మెత్తగా నలుగుతూ
వేసిన ముద్రలు కరుగుతూ
రెండు వెదురు ఆకులు
ఒకటికి ఒకటి
నిశ్శబ్దంగా రాసుకుంటున్నట్టు
కాసేపలా నడిచి వద్దాం
ఒకరిలోకి ఒకరు
తొంగి చూస్తూ
పెదవి దాటని రాగమేదో
పల్లవిగా సుళ్ళు తిరుగుతూ
మౌన చరణాలుగా
రెండు పావురాళ్ళ
గుర్ గుర్ శబ్దాల
ఆలాపనల మద్య పలకరింపులా
కాసేపలా నడిచి వద్దాం
నీరెండనింత దోసిలిలో పట్టి
ఒకరిలోకొకరు
ఇంకుతు వెచ్చగా
తల్లి కాళ్ళ మద్య విశ్రమిస్తున్న
ఆ కుక్క పిల్లలులా
మెడ అంచున చేతులు మెలిక వేస్తూ
.
.
.
.
కాసేపలా...
amazing....beautifully expressed da feel between two souls....
ReplyDeleteThanks a lotandi..:-)
Deleteపదండి.....నడక ఆరోగ్యానికి మంచిదే ;-)
ReplyDeleteమరి రండి ఆరోగ్యంగా నడుద్దాం..:-)
Deleteచాన్నాళ్ళకి మీ ఎదలోతుల్లో ఉప్పొంగిన భావకెరటం...బహుబాగు
ReplyDeleteమీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండీ పద్మార్పిత గారు..
Deleteపిక్ ఎంతగా నచ్చిందంటే అలా చూస్తూ కమెంట్ ఏం రాయాలనుకున్నానో మరచిపోయి బాగుంది చాలా చాలా నచ్చింది అనుకుంటూ పిక్ చూస్తూనే ఉన్నాను.
ReplyDeleteమీలా ఆకుపచ్చటి పిక్ లు దొరకడం లేదండీ..:-)
Deleteమీ అభిమానానికి ధన్యవాదాలు తెలుగమ్మాయి గారు..
ఓ సెల ఏరులా సాగింది మీ కవిత !
ReplyDeleteసాహిత్యం చాలా బాగుంది .
గుండెల నిండా ప్రశాంతతని నింపింది
శ్రీపాద
మీ ఆశీర్వచన స్పందనకు ధన్యవాదాలు శ్రీపాద గారు.. _/\_
DeleteVarma gaaru, meeru naduddamani cheppi mammalni kaasepu eto teesukellipoyaaru:-):-)
ReplyDeletesuperb sir.
కార్తీక్ (ఎగిసే అలలు) గారు మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు సార్..
ReplyDelete
ReplyDeleteతల్లి కాళ్ళ మద్య విశ్రమిస్తున్న
ఆ కుక్క పిల్లలులా
మెడ అంచున చేతులు మెలిక వేస్తూ
కాసేపలా...
చాలా ఆర్దతతో నిండిన భావాలివి . కవిత ఆసాంతం చాలా బాగుందండీ వర్మ గారు
ధన్యవాదాలు శ్రీపాద గారు..
ReplyDelete