Monday, October 22, 2012

పునీతమవ్వాలని..

Photo: నాన్న భుజాలపై నుండి చూసిన ప్రపంచం
నేడు చిన్నబోయింది...

ఆసరాగా నిలిచిన పాదు కొయ్య విరిగి
నేల రాలినట్టు...

నాన్నా కనులలోంచి దొంగిలించబడ్డ కాంతి
నా చుట్టూ చీకట్లను ముసిరింది...

యిదంతా ఓ వలయమని
నిన్నా రేపుల మాయయని
నవ్వుతూ నువు చెప్పిన మాట
యాదికొచ్చినప్పుడంతా ఎద కోతకు గురవుతుంది....

నాన్నా మరొక్క సారి
యిటు తిరగవూ!!

నీ పాదాలు తాకి పునీతమవ్వాలని...
నాన్న భుజాలపై నుండి చూసిన ప్రపంచం
నేడు చిన్నబోయింది...

ఆసరాగా నిలిచిన పాదు కొయ్య విరిగి
నేల రాలినట్టు...


నాన్న కనులలోంచి దొంగిలించబడ్డ కాంతి
నా చుట్టూ చీకట్లను ముసిరింది...

యిదంతా ఓ వలయమని
నిన్నా రేపుల మాయయని
నవ్వుతూ నాన్న చెప్పిన మాట
యాదికొచ్చినప్పుడంతా ఎద కోతకు గురవుతుంది....

నాన్నా మరొక్క సారి
యిటు తిరగవూ!!

నీ పాదాలు తాకి పునీతమవ్వాలని...

7 comments:

  1. ప్చ్...తిరిగి రారుగా:-(

    ReplyDelete
  2. వర్మాజీ, పసితనపు లేత కిరణాలు వీడని కవిత ఇది.
    నాన్న నీడనైనా తాకి పునీతమవ్వాలనుకొనే ఆర్ద్రత ,ఆశ ఎంత గొప్పదో కదా..
    నాటి భుజం ఆసరా ఈనాడు లేదు , కాని మీ అక్షరాలలో భక్తి ఉంది..చాలా బాగా రాసారు సర్.

    ReplyDelete
    Replies
    1. ఆ వెలితి తీరక ఈ ప్రార్థన ఫాతిమాజీ..థాంక్యూ..

      Delete
  3. నాన్నలా మిస్ అయినా వేరే రూపంలో మీకు ఆసరాగా ఉంటారండి.

    ReplyDelete
    Replies
    1. అవును మీ రూపంలో ధైర్యాన్నిస్తూ వున్నారు అనికేత్...
      మీ ఆత్మీయతకు అభివందనాలు అనికేత్...

      Delete
    2. నాన్నా మరొక్క సారి
      యిటు తిరగవూ!!

      నీ పాదాలు తాకి పునీతమవ్వాలని....

      కన్నీటి ధార అక్షరాలు అలుక్కుపోయినట్లుగా చూపిస్తోందండీ... నాన్నని గుర్తుకు తెచ్చారు..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...