Monday, May 21, 2012

కాసేపాగి వస్తాను..



ఆగండి కాసేపాగి వస్తాను..
చేతికంటిన ఈ రంగును
ఇక్కడ ఈ నలుపు తెలుపుల
బొమ్మకు యింత రంగునద్ది
వస్తాను..

ఎన్నాళ్ళుగానో యిలా
పాలిపోయినట్టు కాంతి విహీనమైన
ఈ బొమ్మకు ఈ రంగుపూసి
వెలుగులోకి తెద్దామని
ఇలా ఆగి వస్తా...

ఎవరో అసంపూర్ణంగా వదిలేసిన
రేఖా చిత్రంలా
ఆ కను రెప్పలకావల ఏదో
ఆశ నిరాశల వలయాలు
కాటుక రేఖలా అద్దీ అద్దనట్టు
సగం చెరిగి దోబూచులాడుతూ
గుండె లోలోతుల్లో సుళ్ళు
తిరుగుతున్నాయి...

ఆ నుదుటిపై
పొద్దు గుంకిన సూరీడు ఆనవాలుగా
చెరిగిన తిలకంలా రేఖామాత్రపు
గాయమో కాలమో వెక్కిరిస్తూ
ఎదలో ముల్లులా గుచ్చుతూ...

వాన వెలిసిన రాతిరి
నిర్మలంగా వెలుగుతున్న ఆకాశంలా
ప్రతిఫలిస్తున్న తేజస్సు ఏదో
ఆ చిత్రంలో వెంటాడుతూ
నా రంగులంటిన చేతిని
శుభ్రపరుస్తూ....

16 comments:

  1. వావ్! చాలా బాగుందండీ! ఆగండి కాసేపాగి వస్తా వ్యాఖ్య పెట్టడానికి :)

    ReplyDelete
    Replies
    1. రసజ్ఞ గారూ ఆగానండీ..:-) thank you..

      Delete
  2. Sir , alaanti chitram kosam enthasepainaa aaga vachu andamaina bhavana

    ReplyDelete
  3. చాలా బాగుందండి వర్మ గారు!

    ReplyDelete
    Replies
    1. థాంక్సండీ జలతారువెన్నెలగారూ..

      Delete
  4. Sir,kallallona ninu daachane ,ee paata ennisaarlu vinnano ekkadidi ee paata telapagalaru

    ReplyDelete
  5. ఎవరో అసంపూర్ణంగా వదిలేసిన
    రేఖా చిత్రంలా
    "ఆ కను రెప్పలకావల ఏదో
    ఆశ నిరాశల వలయాలు
    కాటుక రేఖలా అద్దీ అద్దనట్టు
    సగం చెరిగి దోబూచులాడుతూ
    గుండె లోలోతుల్లో సుళ్ళు
    తిరుగుతున్నాయి"
    చాలా చాలా నచ్చిందండి!

    ReplyDelete
    Replies
    1. మీకు నా కవిత నచ్చినందుకు చాలా సంతోషమండీ పద్మార్పితగారూ...

      Delete
  6. kallallona ninnu daachane kannamma song ki music director S.A. Raj Kumar andi. Movie- Preyasi nannu preminchave

    ReplyDelete
    Replies
    1. ఓహ్ థాంక్సండీ..కానీ ఈ పాట నేను జర్నీ విత్ A.R.Rehman albumlo విన్నానండీ..మరి అందులో ఎవరు చేర్చారో??

      Delete
  7. nice feeling varma gaaroo!
    nachchindandee!
    @sri

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...